నాహం వసామి వైకుంఠే నయోగి హ్రుదయే రవౌ మద్భక్త్యా యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద ! Lord says to Narada --



4.10.10

ఓ పవనాత్మజ



ప:ఓ పవనాత్మజ ఓ ఘనుడా
    బాపు బాపనగా పరిగితిగా ||

చ:ఓ హనుమంతుడ ఉదయాచల
    ని
ర్వాహక నిజ సర్వ ప్రబలా

    దేహము మోచిన తెగువకు నిటువలె
    సాహస మిటువలె చాటితిగా 
||
 
చ:ఓ రవి గ్రహణ ఓదనుజాంతక
    మారులేక మతి మలసితిగా
    దారుణపు వినతా తనయాదులు
    గారవింప నిటు కలిగితిగా 
||
 
చ:ఓ దశముఖ హర ఓ వేంకటపతి
    పాదసరోరుహ పాలకుడా

    ఈ దేహముతో ఇన్నిలోకములు
    నీదేహమెక్క నిలిచితిగా 
||



No comments:

Post a Comment